ఆ విషయంలో చిరంజీవి, ఎన్టీఆర్ కంటే నాగార్జునే గ్రేట్.. ఏం జరిగిందంటే?

కింగ్ నాగార్జున తన సినీ కెరీర్ లో సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలలో ఎక్కువగా నటించారు. బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ షోల ద్వారా నాగార్జున ప్రశంసలను అందుకున్నారు. అయితే నాగార్జునకు కలిసొచ్చిన స్థాయిలో మరే స్టార్ హీరోకు రియాలిటీ షోలు కలిసిరాలేదు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా నాగార్జున హోస్ట్ చేసిన రియాలిటీ షోలు మాత్రమే మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఒక సీజన్ కు హోస్ట్ గా చేశారు. అయితే ఈ షో కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడంలో మాత్రం ఫెయిలైందనే సంగతి తెలిసిందే. స్టార్ మా ఛానల్ లో చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ప్రసారమైంది. అయితే ఈ షోకు స్వల్పంగా మార్పులు చేసి ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినిలో ఒక షో ప్రసారమైంది.

అయితే ఎన్టీఆర్ ఎంతో కష్టపడినా ఈ షో కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను అందుకోలేదు. ఈ షోలో అడిగిన ప్రశ్నలు సైతం మరీ సులువుగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ఈ షోకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ అయితే రాలేదని సమాచారం అందుతోంది. బుల్లితెరపై షోలను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసి రేటింగ్స్ ను సొంతం చేసుకున్న హీరో నాగార్జున మాత్రమేనని చెప్పవచ్చు.

ఈ విషయంలో చిరంజీవి ఎన్టీఆర్ కంటే నాగార్జున గ్రేట్ అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నాగార్జున భవిష్యత్తు షోలతో కూడా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక్కో సినిమాకు నాగ్ 8 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై నాగార్జునకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.