పండుగల వాతావరణం వచ్చింది అంటే మన తెలుగు సినిమా దగ్గర సినిమా రిలీస్ ల పరంపర ఏ విధంగా ఉంటుందో తెలిసిందే. అలాగే ఈసారి దీపావళి వరకు పలు సినిమాలు వచ్చాయి. ఇక నెక్స్ట్ వచ్చే అతి పెద్ద పండగ సంక్రాంతి మాత్రమే. ఈ పండుగకు ఆల్రెడీ భారీ పాన్ ఇండియా సినిమాలు ట్రిపుల్ ఆర్(RRR), ఇంకా ప్రభాస్ ‘రాధే శ్యామ్’ లు ఉన్నాయి.
మరి వీటి మూలాన పవన్, మహేష్ బాబుల సినిమాలే వాయిదా పడ్డాయి. కానీ కింగ్ నాగార్జున మాత్రం వాటికి ఎదురుగా నిలబడడం ఖాయం అని గట్టి టాక్. సరిగ్గా రాధే శ్యామ్ తర్వాత రోజే జనవరి 15న తన సినిమాని రిలీస్ చెయ్యాలని ఫిక్స్ చేసాడు.
చాలా కాలం తర్వాత తనకి ఫామిలీ ఆడియెన్స్ నుంచి వచ్చిన యునానిమాస్ హిట్ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా “బంగార్రాజు” సినిమా చేస్తున్నాడు. ఇది కూడా మల్టీస్టారర్ చిత్రమే. దీన్ని ఆ రేస్ లో కన్ఫర్మ్ చేశారు. మరి నాగ్ ఎందుకు అంత డేర్ గా ఉన్నారంటే మళ్లీ ఫ్యామిలీ ఆడియెన్స్ నే నమ్ముకున్నాడట. ఈ సినిమా తప్పకుండా మళ్ళీ అందరికీ నచి తీరుతుంది అని అందుకే అలాంటి సినిమాలు ఉన్నా తన సినిమా దింపాలని ఫిక్స్ చేశాడట. అయితే నాగ్ ప్లాన్ ఏమవుతుందో చూడాలి ఇక.