Nagarjuna Comments : చిరు – జగన్ ల మీటింగ్ పై హాట్ టాపిక్ గా నాగార్జున ఊహించని కామెంట్స్.!

Nagarjuna Comments : ఈరోజు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కీలక మీటింగ్ కోసం విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ ను వేధిస్తున్న టికెట్ రేట్ల సమస్య దానికి ఒక ముగింపు ఇవ్వాలని చిరు ఎన్నో సార్లు తన వంతుగా ప్రయత్నించారు. కానీ ముందు ఎప్పుడు కూడా చిరు కి అపాయింట్మెంట్ రాలేదు దీనితో ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు.

మరి ఈరోజు ఎట్టకేలకు స్వయంగా జగన్ నుంచే చిరు కి పిలుపు రావడంతో ఈ మీటింగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ మీటింగ్ పై టాలీవుడ్ మరి సీనియర్ హీరో అయినటువంటి కింగ్ నాగార్జున పలు ఆసక్తికర కామెంట్స్ చెయ్యడం ఇప్పుడు వైరల్ అవుతుంది.

చిరు ఇండస్ట్రీ బాగు కోసమే జగన్ ని కలవడానికి వెళ్లారు అని ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అలాగే ఇంకో ఆసక్తికర మాట కూడా నాగ్ ఇందులో జోడించారు. చిరంజీవి అంటే జగన్ కి చాలా ఇష్టమని సానుకూల స్పందనే వస్తుందని ఈరోజు నాగ్ తన సినిమా ‘బంగార్రాజు’ ప్రమోషన్స్ లో చేశారు. దీనితో ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.