టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ఈ నెల 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. నాగచైతన్య ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాత వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ అనే సంగతి తెలిసిందే.
అయితే అఖిల్ కాకుండా చైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా నాగచైతన్య తల్లి లక్ష్మీ నాగార్జునతో విడిపోయిన తర్వాత విజయ్ రాఘవన్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీ విజయ్ రాఘవన్ దంపతులకు ఒక కొడుకు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం లక్ష్మీ విజయ్ రాఘవన్ ల కొడుకుకు వివాహం జరగగా వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఈ వివాహ వేడుకకు నాగచైతన్య కూడా హాజరు కాగా అందుకు సంబంధించిన ఫోటో గతంలో నెట్టింట తెగ వైరల్ అయింది. మరోవైపు చైతన్య సమంత పెళ్లి తర్వాత విడిపోవడం అభిమానులలో చాలామందికి బాధను కలిగించడం గమనార్హం. కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు రావడంతో చైతన్య సమంత విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అటు చైతన్య ఇటు సమంత తమకు నచ్చిన ప్రాజెక్ట్ లలో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సమంత ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటుండగా నాగచైతన్య మాత్రం 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే సమంత యాడ్స్ ద్వారా ఊహించని మొత్తాన్ని సంపాదిస్తుండటం గమనార్హం.