Naga Chaitanya: హీరోయిన్ కొంటె చూపులకు సిగ్గు పడుతున్న నాగచైతన్య.. వీడియో వైరల్!

Naga Chaitanya: టాలీవుడ్ అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సినిమా బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే 2016వ సంవత్సరంలో సోగ్గాడే చిన్నినాయనా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా బంగార్రాజు చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో నాగార్జున నాగచైతన్య రమ్యకృష్ణ కృతి శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.

జనవరి 14వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా మ్యూజిక్ నైట్స్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ వేడుకల్లో భాగంగా నాగార్జున మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పై ప్రశంసలు కురిపించారు.

ఈ సమయంలో వేదికపై చిత్ర బృందం కూడా ఉన్నారు. ఇలా నాగార్జున మాట్లాడుతున్న సమయంలో వేదికపై ఒక సరదా సన్నివేశం చోటు చేసుకుంది.నాగార్జున మాట్లాడుతున్న సమయంలో నాగచైతన్య వెనక్కి తిరిగి చూడగా హీరోయిన్ దక్ష నాగర్కర్‌ వైపు చూశారు.ఇలా నాగచైతన్య తన వైపు చూడగానే ఆ హీరోయిన్ కూడా కొంటెగా తన వైపు చూస్తూ కనుబొమ్మలు ఎగుర వేసింది.ఇలా హీరోయిన్ కొట్టి చూపులు చూడగానే నాగచైతన్య సిగ్గుతో తల పక్కకి తిప్పుకున్నారు. ఈ సంఘటన అక్కడే ఉన్న కెమెరాలలో బందీ కావడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.