Nagachaitanya: నన్ను శోభితను కలిపింది అదే… కచ్చితంగా తనతో సినిమా చేస్తా: నాగచైతన్య

Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య త్వరలోనే తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈయన తన రెండో పెళ్లిలో భాగంగా నటి శోభితను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా శోభిత వైజాగ్ కు చెందిన అమ్మాయి కావడంతో ఈ సినిమా వైజాగ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టాలి లేదంటే ఇంట్లో నా భార్య ముందు నా పరువు పోతుందని తెలిపారు.

ప్రస్తుతం మా ఇంట్లో రూలింగ్ పార్టీ కూడా అదే అంటూ తెలియజేశారు. ఇక శోభిత తన ప్రయాణం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తన జీవితం చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. కొత్త లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాను. మా పెళ్లి జరిగి రెండు నెలలు అవుతుంది.ఈ సమయంలో ఇద్దరం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క మాకంటూ స్పెషల్ సమయం కేటాయించుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటాం.

మా ఇద్దరిలో ఉన్నటువంటి ఒకే లక్షణం ఇదేనని తెలిపారు. అలాగే సినిమాపై మాకు ఉన్న ప్రేమ మాటల్లో వివరించలేము.. లైఫ్ పైన మాకు ఎలాంటి ఆసక్తి ఉందో అదే మమ్మల్ని ఒకటిగా ముందుకు నడిపించింది అంటూ తెలియజేశారు. ఇక మా ఇద్దరికీ ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టమని నాగచైతన్య తెలిపారు.. ఇకపోతే నాగచైతన్య శోభిత సినిమా చేయటం గురించి మాట్లాడుతూ ఇద్దరికీ సరిపడా అద్భుతమైన కథ దొరికితే తప్పకుండా తనతో కలిసి సినిమా చేస్తానని తెలిపారు.. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు కానీ వీరిద్దరూ ప్రేమలో పడి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.