Nagababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదివరకు ఎన్నో విషయాల గురించి పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడారు. ముఖ్యంగా రాజకీయాలలో వారసత్వం గురించి ఈయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజకీయపరంగా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో అలాంటి వారికి పదవులు కేటాయించాలి తప్ప కుటుంబ రాజకీయాలకు తావు ఉండకూడదని ఒక వ్యక్తి రాజకీయాలలో స్థిరపడిన తర్వాత తన కుటుంబ సభ్యులందరికీ పదవులు ఇవ్వకూడదు అంటూ గతంలో ఎన్నో పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడారు.
ఇలా గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారాయని చెప్పాలి. నిజానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నాగబాబుకు ఈ ఎమ్మెల్సీ ఇవ్వటంతో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారు ఉన్నారు. అయితే అలాంటి వారికి కాకుండా కుటుంబ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక జనసేన పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం ఎప్పటికప్పుడు ఈయన తన నేతలు అందరికీ కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నప్పటికీ చాలామంది నోటి దురుసు కారణంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి కూడా తలనొప్పిగా మారారు. అలాంటి వారిలో నాగబాబు కూడా ఒకరు. ఈయన ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా దూకుడు కనబరిస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పాలి.
ఇక వారసత్వ రాజకీయాల గురించి చాలామంది పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మరికొందరు మాత్రం పవన్ ను సమర్థిస్తున్నారు. నాగబాబుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాల్సి ఉండగా ఆయన మాత్రం కూటమి కోసం ఆ టికెట్ వదులుకోవాల్సి వచ్చింది అంతేకాకుండా పార్టీ గెలిచినప్పుడు మాత్రమే కాదు ఓడిపోయినప్పుడు కూడా తన తమ్ముడికి అండగా నిలిచి ప్రోత్సహిస్తూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఎమ్మెల్సీ విషయంలో పవన్ నాగబాబు పేరును ఖరారు చేయడం అనేది సరైన ఎంపిక అంటూ కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు.
