ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అటువంటి వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. జబర్దస్త్ ద్వార కామెడియన్ గా మంచి గుర్తింపు పొందిన అవినాష్ ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల జబర్ధస్త్ కి స్వస్తి చెప్పాడు. అవినాష్ ప్రస్తుతం పలు టీవీ షోస్ లో సందడి చేస్తున్నాడు. అంతే కాకుండా తన భార్యతో కలిసి పలు షోలలో సందడి చేస్తున్నాడు. ఇక సోషియల్ మీడియాలో కూడా అవినాష్ తన భార్యతో కలిసి ఫన్నీ రీల్స్, డాన్స్ వీడియోలు చేస్తూ తన ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నాడు.
ఇదిలా ఉండగా అవినాష్ జబర్ధస్త్ మానేసిన తర్వాత మా టీవీలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షో ద్వారా తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే అవినాష్ అలాగే మరికొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ కూడా కామెడీ స్టార్ సోలో సందడి చేస్తున్నారు. ఈమధ్య కాలంలో జబర్ధస్త్ కమెడియన్లు జబర్ధస్త్ మానేసి కామెడీ స్టార్స్ షో లో చేస్తున్నారు. అందుకు కారణం నాగ బాబూ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ముక్కు అవినాష్ ని ఈ ప్రశ్న వేయగా షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.
ఇంటర్వ్యూ లో అవినాష్ మాట్లాడుతూ.. జబర్ధస్త్ నుండి మేము బయటికి రావటానికి నాగబాబు గారు అస్సలు కారణం కాదు. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. మా ఇష్టం తోనే మేము కామెడీ స్టార్స్ షో కి వచ్చాము. అయినా నాగబాబు గారు జబర్దస్త్ లో ఉన్నప్పుడు మమ్మల్ని ఒక తండ్రిగా గైడ్ చేసేవాడు. ఎప్పుడైనా స్కిట్లూ సరిగా చేయకపోతే రూమ్ కి పిలిచి మరి వార్నింగ్ ఇచ్చేవాడు. స్కిట్ చేయటానికి ఎలాంటి పాయింట్ ఎంచుకుంటే బావుంటుందో ఆయన సలహా ఇచ్చేవారు. ఏదైనా తప్పు చేస్తే.. నా కొడకా ఇంకోసారి ఇలా మిస్టేక్ చేశావో అంటూ ఒక కుటుంబ పెద్దల వార్నింగ్ ఇచ్చేవాడు. ఇలా అన్ని సందర్భాలలో మమ్మల్ని నాకు బాబు గారు ఎంతో ప్రోత్సహించేవారు. అంతేకానీ ఎప్పుడు మా నిర్ణయాలలో తలదూర్చి వారు కాదు. అంతేకానీ మేము జబర్దస్త్ మానేయడానికి కారణం మాత్రం ఆయన కాదు అంటూ చెప్పుకొచ్చాడు.