ధనరాజ్ మాట్లాడుతుండగా కరివేపాకు అంటూ పరువు తీసిన నాగబాబు?

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన ధనరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ధనరాజ్ సినిమాలలో కూడా నటించి తన పాపులారిటీ మరింత పెంచుకున్నాడు. అయితే నాగబాబు జబర్ధస్త్ నుండి బయటికి వచ్చిన తరువాత ధనరాజ్ కూడా జబర్ధస్త్ కి స్వస్తి చెప్పాడు. కొంత కాలం తర్వాత మా టీవీలో ప్రసారమవుతున్న టీవి షోస్ లో తన కామెడీ తో సందడి చేస్తున్నాడు. కొంత కాలంగా మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో లో నాగబాబు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. జబర్ధస్త్ ద్వారా పాపులర్ అయిన ఎంతోమంది కమెడియన్లు కూడా ఈ షో లో సందడి చేస్తున్నారు.

కామెడీ స్టార్స్ గా ప్రసారమవుతున్న ఈ షో ని ప్రస్తుతం మా సూపర్ సండేస్ పేరుతో ప్రసారం చేయనున్నారు. ఈ షో లో అనసూయ, సుధీర్ కూడా దర్శనమిచ్చారు. ఈ షో కి సుధీర్ యాంకర్ గా వ్యవహరించగా… అనసూయ నాగబాబుతో కలసి జడ్జ్ గా సందడి చేయనుంది. ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ షోలో నాగబాబు ధనరాజ్ ని ఆపరా కరివేపాకు అంటూ పరువు తీశాడు. అయితే నాగబాబు ఇలా మాట్లాడటం వెనుక కూడా ఒక కారణం ఉంది .

ఈ షో లో భాగంగా ధనరాజ్ చేతిలో కరివేపాకు పట్టుకొని బాబా వేషం వేసాడు. ఈ క్రమంలో ధనరాజ్ అనసూయ వద్దకు వచ్చి అనసూయ నేనేమైనా నీకు బాకీ ఉన్నానా? అని అడుగుతాడు. లేదు..కానీ ఎందుకలా అడుగుతున్నావు అని అనసూయ అడుగుతుంది .అందుకు ధనరాజ్ సమాధానం చెప్తూ.. ఏం లేదు ఈ మధ్య రోజు రోజుకి నీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతోంది.. అని అంటాడు. ఇలా ధనరాజ్ అనసూయతో అనగానే పక్కనే ఉన్న నాగబాబు ఆపరా కరివేపాకు అంటూ స్టేజి మీద ధనరాజ్ పరువు తీశారు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగ నవ్వారు.