జబర్దస్త్ నుండి బయటికి రావటంతో సుధీర్ పై సెటైర్లు వేసిన నాగబాబు, ధనరాజ్..!

ప్రముఖ బుల్లితెర కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి తెలియని వారంటూ ఉండరు. యాంకర్ గా, కామెడియన్ గా, నటుడిగా, మెజీషియన్ గా ఇండస్ట్రీలో సుధీర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు బుల్లితెర మీద మాత్రమే కాకుండ హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెర మీద కూడా సుధీర్ తన టాలెంట్ నిరూపించుకున్నాడు.ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన సుధీర్ ప్రస్తుతం ఆ షో నుండి బయటకి వచ్చేసాడు. సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం వల్ల సుదీర్ జబర్దస్త్ మానేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. సుధీర్ మాత్రం మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో సందడి చేస్తున్నాడు.

సుధీర్ మొదట ఢీ షో నుండి బయటికి వచ్చేసాడు. ఆ తర్వాత జబర్దస్త్ .. దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో నుండి బయటకి వచ్చి ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ అనే షో లో అనసూయతో కలిసి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా సుధీర్ మాటీవీలో ప్రసారమవుతున్న మరొక షోలో కూడా దర్శనమిచ్చాడు. మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో మంచి గుర్తింపు పొందింది. ఈ షో ని ప్రస్తుతం మా సూపర్ సండేస్ పేరుతో ప్రసారం చేయనున్నారు.ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.

ఈ షో లో సుధీర్ ఎంట్రీతో అందరు ఒక్కసారిగ షాక్ అయ్యారు. ఇక సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తూ నాగబాబు గారికి వెల్కమ్ చెబుతాడు. దీంతో నాగబాబు గారు ఎవరికీ ఎవరు వెల్కమ్ చెబుతున్నారు? అని పంచ్ వేస్తాడు.ఇక మరొక స్కిట్ లో యాదమ్మ రాజు లేడీ గెటప్ లో వస్తే ఎలాగో 7 లక్షలు ఇచ్చాను . విగ్ పెట్టుకొని రా అని సుధీర్ అంటాడు. ఇలాంటి పనులు చేయటానికి అక్కడినుండి ఇక్కడికి వచ్చావా అని నాగబాబు పంచ్ వేస్తాడు. ఇక ఈ షో ధనరాజ్ కూడా సుధీర్ మీద సెటైర్లు వేసాడు. సుధీర్ గురించి ధనరాజ్ పాట పడుతూ..విడుదల బిడ్డకు విడుదల అని సెటైర్ వేస్తాడు. దీంతో సుధీర్ పగలబడి నవ్వుతాడు.