రాశిఖన్నా గురించి నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.. ఆమె గురించి అంతా తెలుసు అంటూ..?

అక్కినేని నాగచైతన్య వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో తనతో పాటు నటించిన సమంతతో ప్రేమలో పడ్డ నాగచైతన్య కొంతకాలం ఇద్దరు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం వీరిద్దరూ కూడా మనస్పర్థల కారణంగా విడిపోయారు. సమంత నుండి విడిపోయిన తర్వాత నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలో నాగచైతన్య చేసిన లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇక ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నాగచైతన్య కి జోడిగా రాశి ఖన్నా నటించింది. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని జులై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మనం సినిమా తర్వాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ ప్రమోషన్ పనులను వేగవంతం చేసింది. ఈ క్రమంలో నాగచైతన్య, రాశి ఖన్నా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

తాజాగా వీరిద్దరూ కలిసి వీడియో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు రాశిఖన్నా గురించి నాగచైతన్య కరెక్ట్ గా సమాధానాలు చెబుతూ ఆమె గురించి మొత్తం నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాశిఖన్నా కూడా నాగచైతన్య గురించి ఒక ప్రశ్నకు తప్ప మిగిలిన అన్ని ప్రశ్నలకు కరెక్టుగా సమాధానం ఇచ్చింది. ఇక ఈ క్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ రాసి ఖన్నా సెట్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. షాట్ మధ్యలో కొంచం సమయం దొరికితే చాలు ఇద్దరం ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలు తెలుసుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు. నాగ చైతన్య ఇలా చెప్పటంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.