Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య తాజాగా సాయి పల్లవితో కలిసి నటించిన తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాకు ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే .ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా సాయిపల్లవి సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగే ప్రశ్నలకు నాగచైతన్య సమాధానాలు చెబుతారు అంటూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియోలో కొంతమంది అభిమానులు అడిగిన ప్రశ్నలను చైతన్యకు సంధించారు.
ఇందుకు సంబంధించిన వీడియోని సాయి పల్లవి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని నాగచైతన్యను ప్రశ్నిస్తూ ఇదివరకు మీరు ఏ సినిమాలకు చేయని ప్రమోషన్స్ ఈ సినిమా కోసం చేస్తున్నారు. ఎందుకు ఈ సినిమాకు కాస్త ఎక్స్ట్రాగా ప్రమోషన్స్, ఎక్స్ట్రా రీల్స్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ ఒక నటుడిగా తాను ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాను. రెండు సంవత్సరాలుగా తనుకు ఒక హిట్టు కూడా లేదు.
ఎలాగైనా ఈ సినిమాతో విజయం సాధించాలి అనే ఆకలి మీద ఉన్నారని అందుకే ప్రమోషన్లను కూడా భారీగా చేస్తున్నానని చెప్పకనే చెప్పేశారు.. ఇకపోతే ఒక నెటిజన్ నాగచైతన్యను ప్రశ్నిస్తూ యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు అన్న అంటూ ప్రశ్నించారు. అయితే నాగచైతన్య యాక్టింగ్ బాగుండదని ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి సెటైర్లు వేస్తూ ప్రశ్నించారు కానీ నాగచైతన్య మాత్రం ఊహించని సమాధానం ఇచ్చారు.
ఈ ప్రశ్నకు నాగచైతన్య స్పందిస్తూ యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు ఏంటి ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ అని తెలిపారు. కాలం గడిచే కొద్ది నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పటికీ ఈ ప్రాసెస్ కి ఫుల్ స్టాప్ పెట్టొద్దు. ఒకవేళ ఫుల్ స్టాప్ పెడితే గనక నటుడుగా ఎదగడం మానేసినట్టే. అంటే ఫ్యూచర్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు నేను యాక్టింగ్ ఇంకా నేర్చుకోలేదు నేర్చుకుంటూనే ఉన్నాను అంటూ చాలా తెలివిగా కూల్ గా సమాధానం చెప్పారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.