Naga Chaitanya: అలాంటి ఫోటో షేర్ చేసిన నాగచైతన్య.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్?

Naga Chaitanya: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. కెరీర్ మొదట్లో మంచి హిట్స్ అందుకున్నప్పటికి ఆ తర్వాత వచ్చిన సినిమాలు అతన్ని నిరాశపరిచాయి. దీనితో నాగచైతన్య కెరీర్ ముగిసిపోయింది అని చాలామంది అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ మజిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు నాగచైతన్య. అనంతరం విక్టరీ వెంకటేష్ తో కలసి వెంకీ మామ సినిమాలో నటించాడు.

వెంకి మామ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో అదే ఊపుతో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకు పోతున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో మరొక హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య. అలాగే ఈ సంక్రాంతికి విడుదల అయిన బంగార్రాజు సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇందులో తన తండ్రి నాగార్జునతో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం విజయ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మనం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే నాగచైతన్య తాజాగా నటిస్తున్న థాంక్యూ సినిమాతో వీరిద్దరి కాంబినేషన్ మరొకసారి రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది ఈ మూవీకి సంబంధించిన టాకీ పూర్తి అయ్యింది. ఇదే విషయాన్ని ఈ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందంతో కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాగ చైతన్య. ఈ ఫోటోను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాను ఓటీటీ లో కాకుండా థియేటర్స్ లో విడుదల చేస్తామని ప్రకటించింది నిర్మాణ సంస్థ.