వైరల్: ‘నాగ చైతన్య’ బాలీవుడ్ డెబ్యూ మూవీ స్టిల్

'Naga Chaitanya' new Hindi movie working still goes viral

ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో ఒక సూపర్ రోల్ లో నటిస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అక్కినేని నాగ చైతన్య . ఈ సినిమా షూటింగు ఇటీవలనే లఢఖ్‌ లో మొదలవగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం నాగచైతన్య కూడా టీంతో జాయిన్ అయ్యాడు. తాజాగా షూటింగ్ లొకేష‌న్ నుంచి విడుద‌లైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ ఫొటోలో ఆమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావు, డైరెక్టర్ అద్వైత్‌ చందన్‌ తో కలిసి ఉన్న చైతూ ఆర్మీ ఆఫీసర్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ ఆర్మీ రోల్ కోసం చైతూ జిమ్ లో బాగా కసరత్తులు చేసి లుక్ ను మార్చుకున్న‌ట్టు తాజా స్టిల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. సుమారు 20 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

ఇక టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన ‘లవ్ స్టొరీ’ విడుదలకు సిద్ధమవగా, విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యు’ సినిమా షూటింగ్ వర్క్ జరుగుతుంది. ఇక ఇదే వరుసలో ‘బంగార్రాజు’ మూవీ కూడా లైన్లోకి వచ్చేసింది. వీటి తర్వాత చైతన్య, కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు చైతన్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తారని అంటున్నారు.