థాంక్యూ సినిమా డిజాస్టర్ అవుతుందని నాగచైతన్య నీకు ముందే తెలుసా?

విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం థాంక్యూ. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ గత నెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈసినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి ప్రేక్షకులలో ఎన్నో అంచనాలను పెంచేశారు.అప్పటికే లవ్ స్టోరీ బంగార్రాజు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్టుతో ఉన్నటువంటి చైతన్య థాంక్యూ సినిమాపై కూడా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు

ఈ క్రమంలోని ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా గత నెల 22వ తేదీ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని ప్రాంతాలలో కలిపి మొదటి రోజు కోటి రూపాయల వసూలు కూడా రాబట్టలేదని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య థాంక్యూ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ… నిజం చెప్పాలంటే ఇది చాలా భయంకరంగా..షాకింగ్ గా ఉంది. లాల్ సింగ్ చద్దా సినిమా పనులలో పడి తాను థాంక్యూ సినిమాను సరిగా ప్రాసెస్ చేయలేకపోయానని తెలిపారు. ఇక తాను చూసినంతవరకు రచనలో కొన్ని లోపాలు ఉన్నాయని ఈ సందర్భంగా నాగచైతన్య థాంక్యూ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.