Naga chaitanya: విడాకుల తర్వాత సమంత తల్లికి ఫోన్ చేసిన నాగచైతన్య.. ఎందుకంటే?

naga chaitanya calls samantha mother after divorce

Naga chaitanya: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య సమంత విడాకుల ప్రకటన తర్వాత ఎంతోమంది అభిమానులు షాక్ అయ్యారు. ఇలా విడాకులు ప్రకటించిన తర్వాత చాలామంది వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని భావించారు. అయితే సమంత నాగచైతన్య కేవలం విడాకులు తీసుకుంటామని ప్రకటన మాత్రమే చేసినప్పటికీ వీరిద్దరు అధికారకంగా బీరు విడాకుల పత్రాలతో విడిపోలేదు. ఈ క్రమంలోనే విడాకుల ప్రకటన తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. సమంతతో విడాకులు ప్రకటన చేసిన తర్వాత సమంత ఈ విషయం గురించి ఎంతో బాధ పడినట్లు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు.

నాగచైతన్య కూడా సమంతతో విడాకులు తీసుకున్న తరువాత బాగా బాధపడ్డారని అందుకే మీడియా ముందుకు రావడానికి కూడా నిరాకరించారని తెలుస్తోంది. ఇకపోతే విడాకులు ప్రకటించిన తర్వాత మొదటిసారిగా నాగచైతన్య సమంత తల్లికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. సమంత తల్లి నాగ చైతన్యను ఒక కొడుకుగా భావించి తనపై ప్రేమను చూపించడంతో తన తల్లికి ఫోన్ చేసి తనను క్షమించమని చెప్పినట్లు తెలుస్తోంది. సమంత ఒప్పుకుంటే తిరిగి వారిద్దరు కలిసి ఉంటామని చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియడం లేదు.

అయితే సోషల్ మీడియాలో ఈ విధంగా వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని మరికొందరు వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సమంత నాగ చైతన్య విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు కనుక తిరిగి వీరిద్దరూ కలిసే అవకాశమే లేదని కొందరు వారి అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. విడాకుల తర్వాత ప్రస్తుతం వీరిద్దరు పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.