Chaitanya -Sobhita: క్యాన్సర్ పిల్లల కోసం గొప్ప మనసు చాటుకున్న చైతూ శోభిత….. ఏం జరిగిందంటే?

Chaitanya -Sibhita: అక్కినేని హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగచైతన్య ఇటీవల తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు లేకపోతే ఇటీవల నాగచైతన్య రెండో పెళ్లి కూడా చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

నటుడు నాగచైతన్య సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయింది. దీంతో సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య తిరిగి శోభితను పెళ్లి చేసుకున్నారు వీరి వివాహము గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగింది.

ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి తర్వాత వారి సినిమా పనులలో బిజీ ఉన్నారు. అయితే ఇప్పుడే నాగచైతన్య కాస్త ఫ్రీ కావడంతో వీరిద్దరూ తమ సమయాన్ని క్యాన్సర్ పిల్లలతో గడిపి వారి ముఖాలలో చిరునవ్వును తీసుకువచ్చారు.హైదరాబాదులో ఉండే సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ ని సందర్శించారు.ఇక ఈ సెంటర్లో క్యాన్సర్ తో పోరాడుతున్న చాలామంది పిల్లలకు ఉచితంగా ఆశ్రయం ఇస్తూ ఉంటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అక్కడికి వచ్చిన పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ఈ సెంటర్ ఉచితంగా ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత ఈ చైల్డ్ కేర్ సెంటర్ కి వచ్చి అక్కడ పిల్లలందరితో సరదాగా మాట్లాడుతూ వారితో కలిసి డాన్సులు చేస్తూ ఫోటోలు దిగారు. అనంతరం అక్కడున్న పిల్లలందరికీ కూడా కానుకలు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇలా నాగచైతన్య శోభిత అక్కడికి వెళ్లడంతో పిల్లలు  కూడా చిరునవ్వులు చిందించారు. ఇలా ఈ కొత్త జంట చేసిన ఈ మంచి పనికి ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.