Naga Babu : కామెడీ స్టార్స్ షో కి నాగబాబు ఎంట్రీ ప్లస్..? మైనస్..?

Naga Babu: మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు సినిమాలో కీలకపాత్రను పోషించాయి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా మాత్రమే కాకుండా రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరంజ్ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. కాకపోతే ఆ సినిమాకి నష్టాలు రావడంతో అప్పటి నుండి నిర్మాణ రంగం వైపు వెళ్ళలేదు. నాగబాబు ఇటీవల సినిమాలో ఒక కీలక పాత్ర పోషించాడు. ఒకవైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు బుల్లి తెరమీద జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు.

ప్రస్తుతం నాగబాబు మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే షో కి వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ఉన్న నాగబాబు మల్లెమాల వారి తో వచ్చిన మనస్పర్థల కారణంగా జబర్దస్త్ నుండి బయటికి వచ్చేశాడు. తర్వాత జీ తెలుగు లో ప్రసారమైన అదిరింది అనే కామెడీ షో లొ కనిపించినప్పటికీ ఆ షో అట్టర్ ప్లాప్ అయ్యింది. తర్వత జబర్థస్త్ కి పోటీగా మా టీవీలో కామెడీ స్టార్స్ అనే షో ని ప్రారంభించారు. అయితే మొదట్లో ఈ షో అంత ప్రేక్షకాదరణ పొందలేదు. కానీ నాగబాబు జడ్జీ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెల్ల మెల్లగా పాపులర్ అవుతోంది.

నాగబాబు ఎంటర్ అవడం వల్లే ఈ కామెడీ స్టార్స్ మంచి ఫాంలోకి వచ్చింది అంటూ కమెడియన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జబర్థస్త్ నుండి కూడ కొందరు కమెడియన్లు నాగబాబు ని నమ్ముకొని కామెడీ స్టార్స్ షో కి వచ్చారు. కామెడీ స్టార్స్ షో లొ శేఖర్ మాష్టర్ తో కలసి నాగబాబు చేసే సండది మామూలుగా లేదు. షో లో నాగబాబు బిహేవియర్, కమెడియన్స్ ని ఆయన ప్రోచ్చహించే తీరు కారణంగా ఆ షో కి మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే జబర్థస్త్ ని మించిపోతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎట్టకేలకు నాగబాబు ఎంట్రీ కామెడీ స్టార్స్ షో కి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.