అన్నా గుర్తున్నామా… అంటూ నాగ్ అశ్విన్ కు ట్వీట్ చేసిన నెటిజన్.. భారీ అప్డేట్ చెప్పిన నాగ్ అశ్విన్!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.ఈ క్రమంలోనే ప్రభాస్ తన తదుపరి సినిమా గురించి ఎప్పుడు అప్డేట్ విడుదల చేస్తారా అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఏ విధమైనటువంటి అప్డేట్ విడుదల చేయకపోవడంతో అభిమాని ఏకంగా సూసైడ్ లెటర్ కూడా రాశారు.

ఈ క్రమంలోనే ప్రాజెక్టు కె డైరెక్టర్ నాగ అశ్విన్ గతంలో ప్రభాస్ సినిమాల గురించి ట్వీట్ చేస్తూ.. రాధేశ్యామ్ విడుదల తర్వాతే అప్ డేట్లు అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ ను ప్రస్తావిస్తూ “అన్నా గుర్తున్నామా అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.ఈ ట్వీట్ పై అశ్వినీదత్ స్పందిస్తూ గుర్తున్నారు అంటూ నెటిజెన్ కి రిప్లై ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా గురించి భారీ అప్డేట్ విడుదల చేశారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ప్రాజెక్ట్ కే సినిమా గురించి అప్డేట్ విడుదల చేస్తూ ఇప్పుడే ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో నే ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఉంది ఇందులో ప్రభాస్ చాలా కూల్ గా కనిపిస్తారు అంటూ ప్రాజెక్ట్ కే సినిమా గురించి చెప్పుకొచ్చారు.ఇక తిరిగి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జూన్ చివరి వారంలో మొదలవుతుందని ఈ సందర్భంగా అశ్వినీదత్ ప్రభాస్ ప్రాజెక్ట్ కె గురించి అప్డేట్ విడుదల చేశారు.ఇకపోతే ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించగా అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.