ప్రభాస్ ఆయన్ను కరుణించేది ఎప్పుడో

ప్రభాస్

ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ డేట్స్ ఇస్తే చాలు ఏడాది కాదు రెండేళ్లు అయినా ఎదురుచూడటానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. అలా ప్రభాస్ డేట్స్ పట్టుకుని ఎదురుచూపుల్లో మగ్గిపోతున్న దర్శకుడు నాగ్ అశ్విన్. ‘మహానటి’తో మంచి హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ హీరోగా ఓక్ సైన్స్ ఫిక్షన్ సినిమాను ఒకే చేసుకున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించనుంది. నిజానికి ‘రాధేశ్యామ్’ పూర్తవ్వగానే ఈ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ మధ్యలో రెండు సినిమాలు వచ్చి పడ్డాయి. అవే ‘సలార్, ఆదిపురుష్’. నాగ్ అశ్విన్ చూస్తూ ఉండగానే ప్రభాస్ ఈ సినిమాలను స్టార్ట్ చేసేశారు. దీంతో అతని ప్రాజెక్ట్ చాలా వెనక్కు వెళ్ళింది. నిజానికి ఈ జూలైలో సినిమా మొదలవ్వాలి. చూస్తుంటే ‘ఆదిపురుష్’ అంత తొందరగా ఒక కొలిక్కి వచ్చేలా లేదు. ‘సలార్’ కూడ టైమ్ తీసుకుంటోంది. మధ్యలో కోవిడ్ బ్రేకులు పడుతూనే ఉన్నాయి. దీంతో నాగ్ అశ్విన్ సినిమా లాంఛ్ ఇంకొన్ని నెలలు వెనక్కి వెళ్ళింది. చూడబోతే ఈ ఏడాది ఆఖరుకి వెళ్లేలా ఉంది. మరి ప్రభాస్ కోసమే ఎదురుచూస్తున్న ఈ దర్శకుడికి ఎప్పుడు మోక్షం లభిస్తుందో చూడాలి.