క్రేజీ కాంబో ఫిక్స్.. ఎన్టీఆర్‌తో ప్ర‌శాంత్ నీల్ సినిమా క‌న్‌ఫాం చేసిన మైత్రి సంస్థ‌

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి. ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కు సంబంధించిన హీరోల‌ను మ‌న ద‌ర్శ‌కులు డైరెక్ట్ చేయ‌డం, మ‌న హీరోల‌తో వేరే ఇండ‌స్ట్రీల‌కు సంబంధించిన డైరెక్ట‌ర్స్ సినిమా చేయ‌డం జ‌రుగుతూ వ‌స్తుంది. ఈ క్ర‌మంలో కొన్నాళ్లుగా ఎన్టీఆర్ హీరోగా క‌న్న‌డ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఎన్టీఆర్ బ‌ర్త్ డే రోజు ప్ర‌శాంత్ నీల్ ట్వీట్ చిన్న పాటి క్లారిటీ ఇవ్వ‌గా, ప్ర‌శాంత్ నీల్ బ‌ర్త్‌డే రోజు మైత్రి మూవీ మేక‌ర్స్ టీం చేసిన టీం అభిమానుల అనుమాల‌ను పూర్తి నివృత్తి చేసింది. అయితే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూశారు.

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా మైత్రి మూవీ మేక‌ర్స్ ఉప్పెన అనే సినిమాను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల కానుండ‌గా,ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. మా నిర్మాణంలో ఎన్టీఆర్‌తో ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంద‌ని చెప్పే స‌రికి అభిమానుల ఆనందం అవధులు దాటింది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ .. ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. అక్టోబ‌ర్ 13న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

మ‌రి కొద్ది రోజుల‌లో త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా మొద‌లు పెట్ట‌నున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు అయిన‌ను పోయి రావాలే హ‌స్తినకు అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు. ఇందులో శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. విల‌న్‌గా శింబు న‌టిస్తున్న టాక్. ఈ సినిమా పూర్తైన త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్.. ప్ర‌భాస్ హీరోగా స‌లార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్రం గోదావరి ఖనిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.