Kaushal Manda: నన్ను నా భార్యను నడి రోడ్డు మీద కారు ఆపి బెదిరించారు…. కౌశల్ షాకింగ్ కామెంట్స్!

Kaushal Manda: తన లైఫ్‌లో గుర్తుంచుకోదగిన అవమానకర విషయం ఒకటి ఉందని సినీ నటుడు కౌషల్ అన్నారు. తాను తన భార్య సక్సెస్ మీట్‌కి వెళ్లి వస్తుంటే అది జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. కర్నూలు గొడవ గురించి ఫ్యాన్స్ తరపున మాట్లాడడానికి అక్కడికి వెళ్ళామన్న కౌషల్, అక్కడ ఎవరో తమకు తెలియకుండానే హెల్మెట్ లో కెమెరా పెట్టి, తాము మాట్లాడేంత రికార్డ్ చేశారని ఆయన చెప్పారు.

ఆ తర్వాత తాము కార్లో వెళుతుంటే ఓ నలుగురు వచ్చి, కారు ముందు పడుకొని, తన అకౌంట్ గురించి డిటెయిల్స్ అడిగారని కౌషల్ తెలిపారు. అదంతా తనకు ఫూలిష్ నెస్ లా అనిపించిందని ఆయన అన్నారు. నీకేమన్నా ఉంటే కారుకు అడ్డంగా పడుకొని ఏం చేస్తారు అని ఆయన ప్రశ్నించారు.

ఫ్యాన్స్ తరపున మంచిగా మాట్లాడానికి వెళ్లిన తమకు, ఇలా చేయడం తనకు నచ్చలేదని ఆయన అన్నారు. తన ప్రమేయం లేకుండా తన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా తీశారని ఆయన వాపోయారు. అది చాలా పెద్ద తప్పు మామూలుగా అయితే.. నిజానికి వాళ్ళను అరెస్ట్ చేయాలి అని ఆయన తన అభిప్రాయం వెల్లడించారు. అలా తనకు తెలియకుండా ఆ స్టేట్మెంట్ తెచ్చి టీవీ5 కి ఇవ్వగానే తనను ప్రశ్నించారని ఆయన తెలిపారు. అలా ఒకరి ప్రమేయం లేకుండా అలా తప్పు చేస్తే అది అడగకుండా నన్నే తిరిగి ప్రశ్నించారని, జనాలకు అవేం తెలియవు కాబట్టి చూపించింది నమ్ముతారని కౌషల్ వివరించారు.