Actress Hema: తాను ఓ సారి రాజోలు నుంచి చెన్నైకి వచ్చే సమయంలో ఆ రాత్రి ఎందుకో తనకు తానే అనిపించిందని సినీ నటి హేమ తన పేరు మార్పు గురించి చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో అప్పటికే కృష్ణవేణి అనే పేరుతో ఆర్టిస్ట్ ఉన్నారు కదా.. ప్రత్యేకంగా నీకు పేరు రావడం ఏముండదని అందరూ అనేవారని ఆమె అన్నారు. అప్పట్లో కొన్ని సార్లు అలా ఒకే పేరుతో ఉన్న వాళ్ల వల్ల ఒకళ్లకు రావాల్సినవి మరొకరికి వెళ్లిపోయేవని ఆమె చెప్పారు.
అయితే ఒక రోజు రాజోలు వెళ్లి మళ్లీ చెన్నై వెళ్లేటపుడు ఆ రోజు అర్థరాత్రి బాగా ఆలోచించి, తన పేరు హేమ అని పెట్టుకోవాలని నిశ్చయించుకున్నట్లు ఆమె తెలిపారు. అదే విషయాన్ని అమ్మతో చెప్పానని, ఆమెకి కూడా నచ్చడంతో ఆ పేరును ఓకే చేశానని ఆమె చెప్పారు. అప్పుడు హేమ అనే పేరుతో ఎవరూ లేరని, అందుకే ఆ పేరు పెట్టుకున్నానని ఆమె అన్నారు. హేమా మాలిని అనే పేరుతో నటి ఉన్నా ఆమె హిందీలో ఉండడంతో తాను హేమగా సినీ జర్నీని ప్రారంభించానని ఆమె చెప్పారు.
ఇకపోతే తనకు హేమ అనే పేరు ఎవరో పెట్టారని ఆనుకుంటారు చాలా మంది.. కానీ తానే ఆ పేరు పెట్టుకున్నట్టు ఆమె మరోసారి స్పష్టం చేశారు. అలా ప్రారంభమైన తన కెరీర్ ఇప్పటివరకూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అలా కొనసాగుతూనే ఉందని ఆమె తెలిపారు. బాలయ్య బాబు ఊరికే అందరికీ జాతకాలు చెప్తూ ఉంటే, నా జాతకం కూడా చెప్పమని అడిగితే, నువ్వు రాజోలు నుంచి ట్రైన్ ఎక్కావు చూడూ ఆ ముహూర్త బలం, నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. నీదే దునియా అని అనడంతో తనకు చాలా సంతోషంగా ఉందని హేమ ఆనందం వ్యక్తం చేశారు.