నా జీవితం… నా ఇష్టం మీకెందుకు ట్రోలర్స్ పై ప్రగతి ఫైర్!

ప్రగతి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈ మధ్యకాలంలో ప్రగతి ఆంటీ సినిమాలలో కన్నా తన యూట్యూబ్ ఛానల్ ఇంస్టాగ్రామ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ బిజీగా ఉన్నారు. నాలుగు పదుల వయసులో కూడా ప్రగతి ఫిట్నెస్ పై దృష్టి పెట్టి భారీ వర్కౌట్స్ చేస్తూ తన ఫిట్నెస్ కాపాడుకుంటుంది.ఇలా ఈమె వర్కౌట్స్ కి సంబంధించిన ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా ఈ వీడియోలో చూసిన నేటిజన్ లు అసలు మీ ఎనర్జీ మామూలుగా లేదు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ఈ వయసులో ఇవన్నీ దేనికోసం అంటూ నెగిటివ్ కామెంట్లతో పెద్ద ఎత్తున ఈమెను ట్రోల్ చేశారు.అయితే ఇలాంటి వాటిని చూసి చూడనట్టు వదిలేసిన ప్రగతి తాజాగా తన గురించి ట్రోల్ చేసిన వారిపై ప్రగతి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇలా ట్రోల్స్ పై ప్రగతి స్పందిస్తూ ఈమె భారీ కౌంటర్స్ వేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నేను యంగ్ గా కనిపించడం కోసం ప్రయత్నం చేయడం లేదు. దేశోద్దారకులారా. నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా జీవిస్తున్నా..అంతే, నా లైఫ్ ను ప్రేమిస్తున్నాను అంటూ ఈమె తనదైన శైలిలో తన గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ కు గట్టి సమాధానం ఇచ్చారు. ఇలా ప్రగతి కౌంటర్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా ఈ వయసులో కూడా ఈమె డెడికేషన్ అందరూ మెచ్చుకోవాల్సిందే అని చెప్పవచ్చు.