Actress Archana: తన పెళ్లి తర్వాత జీవితం చాలా బాగుందని సినీ నటి అర్చన అన్నారు. కొంతమంది లావయ్యానని అంటున్నారు.. అది కూడా తనకు హ్యాపీగానే అనిపిస్తుందని ఆమె తెలిపారు. ఇకపోతే తాను ఈ మధ్య కాలంలో 6,7 కథలు విన్నానని, వాటిలో నచ్చిన ప్రాజెక్ట్స్ త్వరలోనే ప్రారంభమవుతాయని ఆమె అన్నారు. ఒక మూవీ కూడా విడుదలకు సిద్ధం కాబోతుందని ఆమె చెప్పారు. నిజం చెప్పాలంటే తన వివాహ జీవితం చాలా పాజిటివ్ చేంజ్‌ని తీసుకొచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
అన్నపూర్ణమ్మ గారి మనవడు చిత్రంలో ప్రత్యేకంగా తన పాత్రకు చాలా మంచి స్కోప్ ఉందని, సెకండ్ హాఫ్ నుంచి మంచి పర్ఫామెన్స్ సీన్స్ ఉన్నాయని అర్చన తెలిపారు. కాబట్టి ఈ సినిమా విడుదల కోసం తాను చాలా ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా అందరూ చూడాలని ఆమె అన్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీల్లో రిలీజ్ చేయాలా, థియేటర్లో రిలీజ్ చేయాలా అన్నది డైరెక్టర్ చేతుల్లో ఉంటుందని ఆమె చెప్పారు.
నిజం చెప్పాలంటే ఓటీటీ అనేది ఒక్కోసారి ఎంత గొప్ప లేదా పెద్ద సినిమా అయినా అందులో రిలీజ్ అవుతూ ఉంటాయని ఆమె అన్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని చాలా మంది అంటారు గానీ, తాను ఆ విషయాన్ని నమ్మనని ఆమె కరాఖండీగా చెప్పేశారు. ఒక సినిమాను మంచిగా తీసి, ప్రమోట్ చేస్తే అది ఒక మంచిగా తాను భావిస్తుందని ఆమె స్పష్టం చేశారు. తనకు తెలిసి ఓటీటీలో రిలీజ్ అవ్వడం అనేది ఒక మంచి మార్పు అని, దీని వల్ల చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు ముందుకొస్తున్నారని, థియేటర్లలోనే విడుదల కావాలని అక్కడే ఆగిపోకుండా వాళ్లకు మంచి అవకాశం వస్తోందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.