వైసీపీ ప్రభుత్వానికి ముస్లిం సంఘాల నాయకులు షాక్ ఇవ్వనున్నారా!!

2019 ఎన్నికల్లో ఎంతో మెజారిటీతో గెలిచిన వైసీపీకి అధికారంలోకి వచ్చిన చాలకొద్ది రోజుల్లోనే చాలా వ్యతిరేకత వచ్చింది. కరోనా రావడంతో ఎలాంటి అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టలేకపోయింది అలాగే తీసుకున్న ప్రతి నిర్ణయం సుప్రీం కోర్ట్ ల చుట్టూ, హై కోర్ట్ ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాగే రాష్టరంలో వైసీపీ నాయకులు గాని ప్రభుత్వ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు కూడా వైసీపీకి చెడ్డ పేరు తెస్తుంది.

abdul family

ఆంధ్రప్రదేశ్ లో అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలిసిందే. ఆ కుటుంబం ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడంపై ఇప్పుడు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇక పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. పోలీసుల కారణంగానే ఆ కుటుంబం చాలా దారుణంగా బలైపోయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనబడుతున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఈ ఘటనపై దేశంలో ఉన్న అన్ని ముస్లిం సంఘాల నేతలు వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించిన తీరుపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఈ ఘటనపై త్వరలో సుప్రీం కోర్ట్ కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.

అలాగే రాష్ట్రపతికి కూడా వినతి పత్రం ఇవ్వనున్నట్టు సమాచారం. ఏపీలోని అఖిల పక్ష నేతలతో సమావేశం అయిన తరువాత సుప్రీంలో పిటిషన్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఘటన తర్వాత ప్రవర్తించిన తీరు పోలీసుల కు బెయిల్ వచ్చిన విధానం వారిపై పెట్టిన కేసులు ఇవన్నీ కూడా ప్రస్తావనకు రానున్నాయి. ఇప్పటికి కూడా ఈ కేసుకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన వారి మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో దీనిని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి అదే విధంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు