మురుగదాస్ ఎన్ని కష్టాల్లో ఉన్నారో పాపం

Murugadoss waiting for stars
Murugadoss waiting for stars
ఈయన ‘దీన, రమణ, గజినీ, స్టాలిన్, తుపాకి, కత్తి, సర్కార్’ లాంటి హెవీ యాక్షన్ ఎంటెర్టైనర్లు రూపొందించారు.  విజయ్ కాంత్, రజనీకాంత్, విజయ్, మెగాస్టార్ చిరంజీవి, అమీర్ ఖాన్, అక్షయ కుమార్, మహేష్ బాబు, సూర్య లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేసిన ట్రాక్ రికార్డ్ మురుగదాస్ సొంతం. అలాంటి దర్శకుడు ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉన్నారు. పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేసిన ఆయనకు ఇప్పుడు అదే హీరోల డేట్స్ దొరకడం కష్టంగా మారింది.  ఆయన కథ పట్టుకుని వెళ్తే హీరోలు ఏదో ఒక రీజన్ చెప్పి ఎస్కేప్ అవుతున్నారు.  దీంతో మురుగదాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వార్తల్లో మాత్రమే ఉంటున్నాయి తప్ప వాస్తవ రూపం దాల్చడంలేదు. 
 
వరుసగా ‘స్పైడర్, దర్బార్’ చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఆయన మీద గురి ఉంచలేకపోతున్నారు హీరోలు.  ఈమధ్యకాలంలో మురుగదాస్ ఎక్కువగా ట్రై చేసింది విజయ్ కోసం.  అయితే విజయ్ కథ సంతృప్తికరంగా లేకపోవడంతో మొహమాటం లేకుండా నో చెప్పేశారు. ఆల్మోస్ట్ ఓకే అనుకున్న ప్రాజెక్ట్ కాల్ ఆఫ్ అయిపోయింది.  ఇక మహేష్ బాబుతో సినిమా చేయాలని మురుగదాస్ ఎంతగానో ఆశపడుతున్నారు.  అది కూడ తీరని కోరికే.  ‘స్పైడర్’ మహేష్ బాబుకు ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది మరి.  ఇక తాజాగా ఆయన కమల్ హాసన్ కోసం కథ సిద్ధం చేస్తున్నారని వార్తలు మొదలయ్యాయి.  వాటిలో కూడ వాస్తవం లేదు. 
 
ఎందుకంటే ఇప్పటికే కమల్ హాసన్ చేతిలో మూడు సినిమాలున్నాయి.  వాటిలో ‘ఇండియన్ 2’ సగంలో ఉండగా ‘విక్రమ్’ మొదలవ్వడానికి రెడీగా ఉంది. ఈ రెండూ కాక ఎప్పుడో మొదలుపెట్టిన ‘శభాష్ నాయుడు’ పెండింగ్ ఉంది.  ఇవన్నీ పూర్తయితే తప్ప ఆయన కొత్త సినిమా ఒప్పుకునే పరిస్థితి లేదు.  సో.. మొత్తంగా మురుగదాస్ కు స్టార్ హీరోలను పట్టుకోవడం ఇప్పట్లో కుదిరేలా లేదు.