చార్థామ్ అంటే తెలియని భక్తులు ఉండరు. అయితే ఈ నాలుగు పవిత్రస్థలాలకు ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ కుటుంబం ఐదుకోట్ల విరాళం ఇచ్చింది. ఆ వివరాలు…
ఉత్తరాఖండ్లోని ప్రతీష్టాత్మక చార్థామ్ దేవస్థానం బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం చార్థామ్ దేవాలయాలు మూసివేశారు. దీంతో భక్తులు రాక విరాళాలు రాక..చార్ థామ్ దేవాలయాల ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో దేవస్థానం బోర్డు ఉంది. దీంతో దేవాలయాల అదనపు సీఈవో సింగ్ ఈ విషయాన్ని ముఖేష్ అంబానీకి విజ్ఞప్తి చేశారు. దేవస్థానం బోర్డుకు సహకరించాలని విజ్ఞప్తి చేయగా అంబానీ స్పందించారు. ఈక్రమంలో రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు..జియో ప్లాట్ ఫామ్స్ బోర్డు అదనపు డైరెక్టర్ అయిన అనంత్ అంబానీ చార్ ధామ్ దేవస్థానం బోర్డుకు రూ.5 కోట్లు విరాళం అందజేశారు.