ఏపీలోని వైజాగ్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి అందరికీ తెలుసు. కానీ.. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ మైనింగ్ పై చాలా సీరియస్ గా ఉంది. అయితే.. అక్రమ మైనింగ్ ను ఆపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా… అక్కడ ఒకే ఒక చిక్కు వచ్చిపడుతోంది. అదే వైసీపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతోంది.
అక్రమ మైనింగ్ లో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఉండటంతో ఏం చేయాలో తెలియడం లేదు. అయితే.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… మాత్రం అక్రమ మైనింగ్ వ్యవహారంలో చిక్కుకున్న అధికార పార్టీ నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చేశారు.
ఈసందర్భంగా ఆయన వైజాగ్ లో మాట్లాడుతూ… అక్రమ మైనింగ్ పై విచారణ జరుగుతోందని… ఎంత మేరకు అనుమతి ఇచ్చారు.. ఎంత మేరకు తవ్వుతున్నారు.. అనే దానిపై విచారణ చేస్తున్నామని.. త్వరలోనే ఎవరు తప్పు చేశారో తెలుస్తుందని.. అప్పుడు తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే.. వాళ్లను వదిలేది లేదు.. అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విజయసాయి.
అయితే.. విజయసాయి స్ట్రాంగ్ వార్నింగ్ తో అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఉన్న అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు భయపడుతున్నారట. వామ్మో.. తమ పేరు ఎక్కడ బయటికి వస్తుందో అని టెన్షన్ పడుతున్నారట. చూద్దాం మరి.. అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో?