Archana: ఒక తమిళ సినిమాకి సంబంధించి తాను హాంకాంగ్‌లో షూటింగ్ కోసం తన మదర్‌తో కలిసి వెళ్లానని ప్రముఖ నటి అర్చన అన్నారు. ఆ మూవీలో తాను ఓ బ్యూటిఫుల్ రోల్‌లో నటించానని ఆమె తెలిపారు. ఇకపోతే ఆ చిత్ర షూటింగ్‌లో భాగంగా హాంకాంగ్‌లో సాంగ్ ఒకటి షూట్ చేశామని, టాకీ షూట్ అంతా చెన్నైలో చేశామని ఆమె చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా ఆ సినిమా ప్రొడ్యూసర్ ఒకటి, రెండు మాట్లాడిన మాటలు తనకు నచ్చలేదని అర్చన అన్నారు. అసలు అతను సినిమా తీయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు తనకు అనిపించలేదని, తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని ఎక్కడో ఒక దగ్గర వినియోగించాలని ఆ సినిమా తీసినట్టు అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఆ డైరెక్టర్ మాత్రం తనతో చాలా బాగా ఉండేవారని ఆమె అన్నారు. ఇక విషయానికొస్తే ఆ సినిమా రిలీజయ్యాక చూస్తే తనతో షూట్ చేసిన సాంగ్ పార్ట్ మొత్తం తీసేశారని ఆమె వాపోయారు. అప్పుడు తాను చాలా బాధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సంఘటనలు తాను చాలా ఎదుర్కొన్నానని, ఇది ఒక్కటే కాదని నటి అర్చన అన్నారు. ఓ సారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫండ్ రైజర్ కోసం ఒక షో చేస్తున్నామని, అక్కడ స్టేజ్ పైకి ఎవరూ వెళ్లకపోయేసరికి తాను ఎక్కి, మనం చేద్దాం అని మాస్టర్‌తో అని వెళ్లామని ఆమె చెప్పారు. వెంటనే తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్దాయన వచ్చి అందరి ముందూ గట్టిగా అరిచారని ఆమె చెప్పారు. ఆ సమయంలో తన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా దెబ్బతిన్నదని ఆమె బాధపడ్డారు. ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని ఆమె చెప్పారు. ఇలాంటివి జరిగినపుడే తన సంకల్పం ఇంకా స్ట్రాంగ్ అవుతుందని ఆమె చెప్పారు. ఇకపోతే అది జరిగిన తర్వాత తాను ఫర్మామ్ చేశానని, కానీ అది చివరికి టీవీలో వేయలేదని ఆమె వివరించారు. తనకే కాదు ఎంత పెద్ద యాక్టర్ అయినా ఏదో ఒక టైంలో ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉంటున్నారని అర్చన వెల్లడించారు.