Ramoji Film City: కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇండియాలో ఎన్నో సినిమాలు నిత్యం షూటింగులు జరుపుకుంటున్నాయి అంటే అందుకు అనువైన ప్రదేశం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ అని చెప్పాలి. ఇక్కడ అధునాతన సౌకర్యాలతో కొన్ని వందల ఎకరాలలో ఈ ఫిలిం సిటీ ఏర్పాటు చేయబడి ఉంది. నిత్యం కొన్ని వందల సినిమాలు ఇక్కడ షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉంటాయి. ఇకపోతే ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో దయ్యాలు ఉన్నాయని అదొక భయంకరమైన ప్రదేశం అంటూ వరుసగా హీరోయిన్లు తమ అనుభవాలను బయట పెట్టడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి కాజోల్ ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాను ఎన్నో ప్రదేశాలలో షూటింగ్ కోసం వెళ్లానని కానీ రామోజీ ఫిలిం సిటీలో మాత్రం తాను ఉండలేకపోయాను అని తెలిపారు.. అక్కడ తాను ఎంతో అభద్రతాభావానికి గురి అయ్యానని, ప్రపంచంలో అత్యంత భయంకరమైన ప్రదేశం రామోజీ ఫిలిం సిటీ అంటూ కాజోల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటోందని గ్రహించిన ఫిలింసిటీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలు ఫలించి కొన్ని రోజుల తర్వాత ఫిలింసిటీ చాలా గొప్ప ప్రదేశం అంటూ కితాబు ఇచ్చారు.
ఇక అప్పటికే జరగాల్సిన డామేజ్ మొత్తం జరిగిపోయింది. కేవలం కాజోల్ అని మాత్రమే కాదు తాప్సి, రాశిఖన్నా, కీరవాణి వంటి తదితరులు కూడా తమకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. ఇలా సెలబ్రిటీలందరినీ భయాందోళనలకు గురి చేస్తున్న నేపథ్యంలో నిజంగానే అక్కడ దయ్యాలు ఉన్నాయా అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. నిజానికి రామోజీ ఫిలిం సిటీ ఉన్న స్థలంలో ఒకానొకప్పుడునిజాం సైనికుల సమాధులు ఉండేవని కొందరు అలాగే ఆ స్థలం పూర్వపు యుద్ధభూమి అని మరికొందరు నమ్ముతున్నారు. దీనివల్ల అక్కడ చుట్టుపక్కల నివాసితులకు శాంతి లేదని, అక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయని ఈ తరహా విషయాలను నమ్మేవారు చెబుతున్నారు. మరి తారలకు ఎదురవుతున్న అనుభవాల వెనుక ఉన్నవి అతీంద్రీయ శక్తులా? లేక అనుమానాస్పద వ్యక్తులా? అనే నిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.