oney Vastu Tips: సాధారణంగా మనం వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్ముతాము.ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులను పాటించడం వల్ల మన కుటుంబం ఎంతో సుఖసంతోషాలతో ఉంటుందని, ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడుపుతారని భావిస్తారు. అందుకోసమే మనం ఇంట్లో అలంకరించుకునే ప్రతి ఒక్క వస్తువు విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని ఎంతో నమ్ముతాము. అయితే సాధారణంగా చాలా మంది వారి ఆర్థిక అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తూ ఉన్నప్పటికీ చేతిలో డబ్బు నిలవదు. ఏదో ఒక విధంగా అనవసర ఖర్చులు ద్వారా డబ్బు మొత్తం వృధా అవుతూ ఉంటుంది.
ఈ విధంగా డబ్బు వృధా అవుతున్న చేతిలో రూపాయి నిలువకుండా ఉన్న వారు డబ్బు నిల్వ చేసే విషయంలో వాస్తు శాస్త్రాన్ని తప్పనిసరిగా పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనం మన ఇంట్లో డబ్బులు భద్రపరిచి చోటు సరైనది అయినప్పుడే ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఈ క్రమంలోనే మనం ఎల్లప్పుడూ ఇంటిలో ఉత్తర దిశలో మాత్రమే డబ్బులు భద్రపరచాలి. అలా కాకుండా పడమర దిశ వైపు డబ్బులు భద్రపరచడం వల్ల చేతిలో డబ్బు నిలవదు.
ఉత్తరం లేదా తూర్పు ఉత్తర మూలంలో డబ్బు నిల్వ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండే మన చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది. ధనానికి అధిపతి కుబేరుడు కనుక కుబేరుడికి ఎంతో ఇష్టమైన స్థానం ఉత్తరం. అందుకోసమే ఉత్తరదిశలో డబ్బును భద్రపరచడం వల్ల మన ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఆ అమ్మవారి అనుగ్రహం కూడా ఎల్లవేళలా మనపై ఉంటుంది.