అఖిల్ గురించి అడిగిన ప్రశ్నలకు కలత చెందిన మోనాల్ గజ్జర్.. ఇకనైనా ఆపేయండి ప్లీజ్ అంటూ విజ్ఞ‌ప్తి

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సూపర్ హిట్ షో. లేటెస్ట్ గా తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సీజన్ 4 లో అబిజిత్ విన్నర్ గా నిలిచారు. రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇప్పటికే ఈ సీజన్ లో హైలెట్ గా నిలిచిన ప్రతీ ఆర్టిస్ట్ తమ కెరీర్ తో బిజీగా మారారు. ఇప్పుడు నెట్టింట్లో బిగ్ బాస్ బిగ్గెస్ట్ క్రేజీ పెయిర్ పేర్లు మళ్ళీ మార్మోగుతున్నాయి. బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ నడిపే నేపథ్యంలో ఈసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీని నడిపించాడు బిగ్ బాస్. మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ ల మధ్య ఉన్న రిలేషన్ పై మళ్ళీ వార్తలు వస్తున్నాయి. నిజానికి హౌస్ లో మోనాల్, అఖిల్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రతి ఒక్కర్ని ఆలోచింపజేశాయి.

కానీ అది కేవలం ఆన్ స్క్రీన్ మాత్రమే అంటూ.. బిగ్ బాస్ అయిపోయాక తమ మథ్య ఎలాంటి రిలేషన్ లేదని అన్నారు మోనాల్. రీసెంట్ గా తరచూ అఖిల్ గురించి మోనాల్ ని ప్రశ్నలు అడగడంతో కాస్త ఇబ్బందికి గురవుతున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్ గా అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ కి వస్తుంటే ఫ్లైట్ లో ఒక అభిమాని మోనాల్ ని అఖిల్ ఎలా ఉన్నారంటూ ప్రశ్నించారని.. అలా అడిగినందుకు తాను చాలా డిస్టర్బ్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను, అఖిల్ కలిసి ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని.. వారిద్దరూ కలిసి ఉన్నట్లు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని.. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని అన్నారు.

ఇకనైనా తనని, అఖిల్ విషయంలో ప్రశ్నలు అడగడం మానేస్తారని ఆశిస్తున్నానంటూ మోనాల్ గజ్జర్ తెలిపారు.
ప్రస్తుతం మోనాల్ గజ్జర్ ప్రముఖ డాన్స్ రియాలిటీ షో లో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని సినీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్ ఫోకస్ మొత్తం సినిమాలపైనా.. తన కెరీర్ పైనే ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు.