Kuberaa Movie: ఏంటి కుబేర మూవీలో ఆ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ నాగార్జున కాదా.. ఆ హీరో రిజెక్ట్ చేయడంతో!

Kuberaa Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మరో కీలక పాత్రలో నటించారు. ఇటీవల జూన్ 20 తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు క్యూ కట్టారు.

మూడు రోజుల్లోనే ఏకంగా 80 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటూ తాజాగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు మూవీ మేకర్స్. ఇది ఇలా ఉంటే సినిమాలో ధనుష్ మెయిన్ హీరో అయినప్పటికీ సినిమా కథ మొత్తం కూడా నాగార్జున చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇందులో నాగ్ సీబీఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో కనిపించారు. ఫస్ట్ హాఫ్ లో కాస్త నెగెటివ్ ఛాయలు ఉన్న పాత్రలో కనిపించిన నాగార్జున సెకండ్ హాఫ్ లో మాత్రం ధనుష్ ను కాపాడే వ్యక్తిగా అద్భుతంగా నటించి మెప్పించాడు.

అందుకే కుబేర సినిమాలో నాగార్జున నటన గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమాలో నాగార్జున పాత్ర కోసం మొదట నాగార్జునను అనుకోలేదట. నాగార్జున ఇందుకు ఫస్ట్ ఛాయిస్ కాదని తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను మొదట సంప్రదించారట. ఆయనకు కథ కూడా చెప్పారట. అయితే ఎందుకో గానీ మోహన్ లాల్ పెద్దగా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో శేఖర్ వెంటనే నాగార్జున దగ్గరికి వెళ్లి కథ చెప్పారట. కథ బాగుందని చెప్పడంతో వెంటనే కుబేర సినిమా పట్టాలెక్కిందట.