Mohan Babu: నరేష్ హీరోగా చేసిన మామ మంచు అల్లుడు కంచు, మరొకటి పాండవులు పాండవులు తుమ్మెద ఈ రెండు సినిమాల్లో తాను సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశానని ప్రముఖ కథానాయకుడు వరుణ్ సందేశ్ అన్నారు. దానికి కారణం ఆ సినిమాల్లో మోహన్ బాబు గారు ఉండడమే అని ఆయన స్పష్టం చేశారు. ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చిందనే సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా సరే ఆ సినిమాల్లో నటించానని ఆయన వివరించారు.
ఇకపోతే తనకు మోహన్ బాబు గారితో ఆ సినిమా వరకు అంత పరిచయం లేదని, ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే ఆయనతో మొదటిసారిగా మాట్లాడానని వరుణ్ సందేశ్ చెప్పారు. ఆయనకు తనకు ఎలా సంబంధం ఏర్పడిందో వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా పంచుకున్నారు.
చాలా దూరంలో ఓ రిసార్ట్‌లో తనకు వితికతో వివాహం జరిగిందని వరుణ్ సందేశ్ అన్నారు. కాబట్టి అంత దూరం రైమ్స్ ఆయన రాలేకపోయారని వరుణ్ చెప్పారు. అంత దూరం ప్రయాణం కదా నేను రాలేకపోయాను ఏం అనుకోకమ్మా అని మోహన్ బాబు గారు అన్నారని ఆయన అన్నారు. సరే ఇంక నిజంగానే దూరంగా పెట్టుకున్నాం.. పెద్దాయన కదా అని అనుకున్నామని వరుణ్ చెప్పారు.
ఆ తర్వాత పెళ్లి జరిగిన మరుసటి రోజు మోహన్ బాబు గారు, ఆయన స్టాఫ్‌తో కలిసి మా ఇంటికి వచ్చి అందర్నీ షాక్ చేశారని వరుణ్ సందేశ్ తెలిపారు. అంతే కాకుండా మా కోసం ఓ బొకే తెచ్చి మాకు విషెస్ చెప్పి, కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్లారని ఆయన అన్నారు. ఆయన లెవల్‌కి అలా రావడం అంటే చాలా గ్రేట్ అనిపించిందని, ఆయన అనుభవమంత ఉండదు తన వయసు అని వరుణ్ చెప్పారు.