ట్రంప్ ఓటమితో మోడీ కి చెమటలు పడుతున్నాయ్ .. లాజిక్ ఏంటంటే!

pm modi

 ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం తేలిపోయింది. జో బైడెన్ భారీ మెజారిటీతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై ఘన విజయం సాధించాడు. మ్యాజిక్ ఫిగర్ 270 కంటే ఎక్కువగానే జో బైడెన్ ఓట్లు సాధించాడు, ఇప్పటికే 290 ఓట్లు బైడెన్ సాధిస్తే ట్రంప్ మాత్రం 214 దగ్గరే ఆగిపోయాడు. మూడు రోజుల నుండి ట్రంప్ 214 నుండి ముందుకి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది. ట్రంప్ ఓటమి ఖాయమని రెండు రోజుల ముందే సంకేతాలు అందాయి. చివరికి ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రధాన మీడియా జో బైడెన్‌యే కొత్త అధ్యక్షుడని ధ్రువీకరించాయి.

trump

 అమెరికానే కాదు.. ప్రపంచమంతా కూడా బైడెన్‌నే అధ్యక్షుడిగా గుర్తించింది. అయినా సరే.. ట్రంప్ మాత్రం పట్టు వీడట్లేదు. తన ఓటమిని జీర్ణించుకోలేదు. ముందు అన్నట్లే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాడు. కానీ ఆ పనేదో చేసుకోకుండా తానే గెలిచానంటూ బల్లగుద్ది వాదిస్తూ వేసిన ట్వీట్ చూసి ప్రపంచవ్యాప్తంగా జనం నవ్వుకుంటున్నారు. “నేనే గెలిచా.. అది కూడా భారీ తేడాతో” అంటూ ట్విట్టర్లో ఆయన ఘనంగా ప్రకటించుకున్నారు. దాని మీద ట్విట్టర్లో ట్రోలింగ్ మామూలుగా జరగట్లేదు. ట్రంప్ ట్విట్ చూసి ఆయన ఈ లోకంలో లేదని, ముసలోడి మరి ఛాదస్తం ఎక్కువైందని సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్ల్స్ చేస్తున్నారు.

 ఇక ట్రంప్ ఓటమికి ప్రధాన కారణం కరోనా వైరస్ అనే చెప్పాలి. అప్పటికే ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలపట్ల అమెరికా లోకి విద్యావేత్తలు, మేధావులు తీవ్ర అసంతృప్తిలో వున్నారు. అదే సహాయంలో కరోనా రావటం, దానిని కట్టడి చేయటంలో ట్రంప్ విఫలం కావటంతో సామాన్య జనాల్లో కూడా ట్రంప్ మీద వ్యతిరేకత పెరిగిపోయింది. దీనితో ఆ ప్రభావం ఎన్నికల మీద పడింది. ఇక ట్రంప్ ఓటమి ఇండియా లో మోడీ భక్తులకు బాధ కలిగించిన విషయం తెలిసిందే, ట్రంప్ కు మోడీ అంటే అమితమైన ప్రేమ ఉందని గొప్పగా చెప్పుకునే బీజేపీ భక్తులు ట్రంప్ గెలిస్తే అందులో మోడీ హస్తముందని చెప్పుకోవటానికి సిద్ధమయ్యారు, కానీ ట్రంప్ ఓడిపోవటంతో మౌనం వహిస్తున్నారు.

pm modi

 మోడీ ఏమి తక్కువ తినలేదు అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడని, అందరు ఆయనకే మద్దతు ఇవ్వాలని ఎన్నికల ప్రచారం కూడా చేసి వచ్చాడు. ప్రధాని హోదాలో పక్క దేశం వెళ్ళినప్పుడు అందుకు తగ్గట్లు వ్యవహరించాలి కానీ, ఫక్తు రాజకీయ నాయకుడిగా మాట్లాడటం తప్పు, ఒక వేళ ట్రంప్ మరోసారి అధ్యక్షుడు అయినాగానీ ఇండియా కి ఒరిగే ప్రయోజనం ఏమి లేదు. కానీ ట్రంప్ కి మద్దతు గా మాట్లాడటం వలన జో బైడెన్ దృష్టిలో, ప్రపంచ దృష్టిలో ఇండియా ట్రంప్ కు మద్దతు దేశమనే పేరు పడుతుంది. అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశాలకు ఇలాంటి ట్యాగ్ లు మంచివి కావు