సీఎం వైఎస్ జగన్ ‌కు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్ !

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు ఈ రోజు . ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీ సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. అలాగే పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

jagan modi telugu rajyam

ఇక సీఎం జగన్‌కు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సర్‌ప్రైజ్ ఇచ్చారు. తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను’అన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పులివెందులలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.