డ్యామేజీ కంట్రోల్ మీద ఫోకస్ పెట్టిన మోడీ సర్కార్

Modi Govt In Damage Control Mode

Modi Govt In Damage Control Mode

కరోనా వైరస్.. భారతీయ జనతా పార్టీకి కనీ వినీ ఎరుగని స్థాయిలో డ్యామేజీ చేుసేసింది. కేంద్ర ప్రభుత్వం, కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది. దేశంలో కరోనా వ్యాప్తికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్న విషయం విదితమే. మరీ ముఖ్యంగా వ్యాక్సినేషన్ విషయమై మోడీ సర్కార్ ఎదుర్కొంటున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. కరోనా సెకెండ్ వేవ్ పట్ల ముందస్తు హెచ్చరికలు ఎన్ని వచ్చినా, కేంద్రం లైట్ తీసుకుని, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల మీద ఎక్కువ ఆసక్తి చూపడం వల్లే ఈ దుస్థితి.. అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల బాధ్యతా రాహిత్యమే.. ఇప్పుడు దేశంలో వేలాది మంది కరోనా బారిన పడి చనిపోవడానికి కారణమన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. దీనికి మించి దేశంలో జరిగిన ఆర్థిక విధ్వంసానికి కేంద్రంలోని మోడీ సర్కార్ నైతిక బాధ్యత వహించాలనే డిమాండ్లు పెద్దయెత్తున పుట్టుకొస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో మళ్ళీ ప్రజల్లో ఇమేజ్ పెంచుకునేందుకు ఏం చేయాలి.? అన్నదానిపై బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందట. ఇంకో మూడేళ్ళలో సార్వత్రిక ఎన్నికలొస్తాయి. నిజానికి, బీజేపీ వద్ద వున్న సమయం రెండున్నరేళ్ళే. ఈలోగా తమ మీద పడ్డ నెగెటివ్ ముద్రని ఎలా చెరిపేసుకోగలం.? అన్న విషయానికి సంబంధించి పార్టీలో అంతర్గతంగా లోతైన చర్చ జరుగుతోందట. అయితే, కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం వుండడంతో, ఆ దిశగా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వుంది. ‘ఆల్ ఈజ్ వెల్..’ అని చెప్పడానికి వీల్లేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్ని ఏమార్చడానికి బీజేపీ ఎలాంటి కుయుక్తులు పన్నుతుంది.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో బీజేపీ తర్వాతే ఎవరైనా. కానీ, గతంలోలా ఈ పబ్లిసిటీ పప్పులు ఈసారి ఉడికేలా కనిపించడంలేదు.