బండి సంజయ్ కి మోడీ ఫోన్ .. ఏంచెప్పారంటే ?

Bandi Sanjay counter attack on Owaisi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఈ రోజు ఫోన్ చేసారు. తాజాగా డిసెంబర్ 1 న జీహెచ్ఎంసీ ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే.

Russian President Vladimir Putin endorsed PM Modi’s emphasis on terrorism
 

ఈ ఎన్నికల గురించి ప్రధాని మోడీ బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడి ఆరా తీశారు.ప్రధాని మోడీ దాదాపుగా 10 నిముషాల సమయం పాటు ఎన్నికల సరళి పై బండి సంజయ్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలో మోడీ కార్యకర్తలు అధ్బుతంగా పోరాటం చేశారని అభినందించారు. నాయకుల, కార్యకర్తల పైన జరిగిన దౌర్జన్యం పై ప్రధాని మోడీ అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను కొనియాడారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ నడుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని, అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు ప్రధాని మోడీ.

ఇకపోతే , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.60 శాతం పోలింగ్ నమోదయింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం ఓట్లు పోలయ్యాయి. గతం కంటే ఈసారి కాస్త ఎక్కువ పోలింగ్ నమోదయింది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి 1.31 శాతం అధికంగా పోలింగ్ నమోదయింది. మొత్తం 150 డివిజన్లలో కంచన్‌బాగ్‌లో అత్యధిక పోలింగ్ నమోదయింది