“బాహుబలి” విలన్ అవతారమెత్తిన ఎం ఎం కీరవాణి..పొద్దున్నే పోస్ట్ వైరల్.!

తెలుగు సినిమా దగ్గర చాలా మంది సంగీత దర్శకులు ఉన్నా కూడా ఏ సినిమాకి ఏ రేంజ్ లో ఇవ్వాలో ఆ గ్రాండియర్ ని మ్యాచ్ చేసే వన్ అండ్ ఓన్లీ సంగీత దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అనే చెప్పాలి.

అయితే కీరవాణి ఇచ్చే సంగీతం గ్రాండియర్ ఎంత అద్భుతంగ ఉంటుందో తన బాహుబలి సిరీస్ లేటెస్ట్  గా ట్రిపుల్ ఆర్(RRR) సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. ప్రతి ఫ్రేమ్ కి అత్యద్భుతంగా స్కోర్ ని గాని పాటలను గాని అందించే కీరవాణిలో ఒకింత కోపం ఒకింత ఫన్ యాంగిల్, లాగే వెటకారం కూడా ఎక్కువే అని చెప్పాలి.

మరి రీసెంట్ గానే ఓ ప్రముఖ వ్యక్తి తమ ట్రిపుల్ ఆర్ సినిమాని గే సినిమా అన్నాడని ఒక రేంజ్ లో తిట్లు, వ్యంగ్యాస్త్రాలతో రెచ్చిపోయారు. ఇక మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫన్ పోస్ట్ ఈరోజు ఉదయాన్నే పెట్టడం మంచి ఆసక్తిగా మారింది.

తాను 2018లో తీసుకున్న ఒక ఫోటో ని ఇప్పుడు సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ పిక్ గా పెట్టి అందులో నేను తమ బాహుబలి విలన్ కాలకేయ ప్రభాకర్ లా ఉన్నానా అంటూ తమ ఫాలోవర్స్ ని అడిగారు. దీనితో ఈ ఫన్ పోస్ట్ మంచి వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు కీరవాణి అయితే హరిహర వీరమల్లు తదితర భారీ సినిమాలు చేస్తున్నారు.