TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్ ఇచ్చింది పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తీన్మార్ మల్లన్న ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతూనే పార్టీకి నష్టం వాటిలే కార్యకలాపాలను చేపడుతున్న నేపథ్యంలో ఆయనకు గతంలో క్రమశిక్షణ కమిటీ హెచ్చరిస్తూ నోటీసులను జారీ చేశారా అయినప్పటికీ కూడా ఈయన తన తీరును ఏమాత్రం మార్చుకోలేదు.
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా ఇప్పటికీ పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు తీన్మార్ మల్లన్నపై వేటు పడింది ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోబడుతుంది అంటూ గతంలో క్రమశిక్షణ కమిటీ తెలియజేసింది అయితే అది నిజమని మల్లన్న సస్పెండ్ తో నిరూపించారు.
గతంలో కూడా ఈయన పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి ఆరో తేదీ ఈయనకు నోటీసులను అందజేశారు ఫిబ్రవరి 12వ తేదీలోగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపినప్పటికీ మల్లన్న మాత్రం ఈ నోటీసుల గురించి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పకపోవడంతోనే క్రమశిక్షణ కమిటీ ఆయనపై చర్యలు తీసుకుందని తెలుస్తోంది.
కాంగ్రెస్ తీరు బీసీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఉందన్నారు మీడియా ముందు తీన్మార్ మల్లన్న. రాహుల్ గాంధీ బాటలో పయనిస్తూ బీసీల గురించి మాట్లాడితే.. షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చిన మరుసటి రోజే వేటు పడింది. దాంతో పార్టీ లైన్ దాటిన వారిపై వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఈయన గతంలో హనుమకొండ బహిరంగ సభలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో కూడా ఈ విషయం తీవ్ర దుమారం రేపింది ఇలా తరచూ ఈయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.