Kavitha: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న ఈమెకు పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటీ? అని యాంకర్ అడిగిన ప్రశ్నలకు కవిత పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో పూర్తిగా వామపక్ష భావాజాలంతో ఉన్నట్లు కనిపించారు. చేగువేరాను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సీపీఐ, సీపీఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. కంప్లీట్‌గా లెఫ్ట్ నుంచి రైట్‌కు వచ్చారు. బీజేపీ పక్కన చేరిన నాటి నుంచి హిందుత్వం మీద అతిభక్తి పెరిగిపోయింది.
పవన్ కళ్యాణ్ చేసే ప్రకటనలకు ఒకదానితో మరొకటి ఏమాత్రం సంబంధం ఉండదని తెలిపారు.రేపు తమిళనాడుకు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోము అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనీ కవిత తెలిపారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టిన 15 సంవత్సరాలకు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో ఒక వైసీపీ పార్టీతో తప్ప మిగిలిన అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం అవ్వడం అనేది ఆంధ్ర ప్రజల దురదృష్టం అంటూ కవిత మాట్లాడారు. ఇలా పవన్ కళ్యాణ్ గురించి కవిత చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఈమె వ్యాఖ్యలపై జనసైనికులు జనసేన నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.