భద్రాద్రిలో ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం..

తాజాగా భద్రాది- కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గట్టి మాటల యుద్ధం జరుగుతుంది. నువ్వు గెలువవు కదా అంటూ నువ్వు గెలువవు అంటూ సవాల్ విసురుకుంటున్నారు. భద్రాద్రి జిల్లాలో ఐదు సీట్లు కాదు కదా.. నువ్వు కూడా గెలవలేవు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య.. తెరాస ఎమ్మెల్యే రేగా కాంతారావును ఉద్దేశించి అన్నారు.

అంతేకాకుండా నీ స్థానంలోనూ నిన్ను గెలవనివ్వను అని అన్నారు దీంతో కాంతారావు కూడా ఫేస్బుక్ వేదికగా మరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వీరయ్య గెలవలేరని.. మరో నియోజకవర్గం చూసుకోవాలి అని.. ఎన్నికల తర్వాత నీ అడ్రస్ ఎక్కడో చూద్దాం అంటూ అతడిపై సవాల్ విసిరారు.