ఎమ్మెల్యే వెల‌గ‌పూడి అనుచ‌రుడు లైంగిక దాడి..ఆ మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

విశాఖ‌ప‌ట్ట‌ణంలో దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిళ శానిటైజ‌ర్ తాగి ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డింది. ఓ బ‌డా నేత అనుచ‌రుడి వేధింపులు తాళ‌లేక ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే పెద వాల్తేరు ప్రాంతంలో ఏస్తేరు రాణి అనే మ‌హిళ రోడ్డు ప‌క్క‌న ఓ చిన్న హోట‌ల్ న‌డుపుకుంటోంది. అదే ప్రాంతంలో నివ‌సిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు అనుచ‌రుడు ఈగ‌ల స‌త్యం త‌రుచూ ఆ మ‌హిళ హోట‌ల్ కు వచ్చి ఏదో ర‌కంగా ఇబ్బందుల‌కు గురిచేసేవాడుట‌. హోట‌ల్ స‌క్ర‌మంగా న‌డ‌వాలంటే త‌న ఆశీస్సులు ఉండాల‌ని అందుకు త‌న‌తో స‌న్నిహితంగా ఉండాల‌ని త‌రుచూ కోరేవాడుట‌.

shadow
shadow

అలా కాని ప‌క్షంలో ల‌క్ష రూపాయ‌లు అప్పు తీసుకుని ఎగ్గొట్టిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని..జైలులో పెట్టిస్తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డేవాడుట‌. ఆదివారం కూడా ఇలాంటి లైంగిక బెదిరింపుల‌కే పాల్ప‌డ్డాడుట‌. న‌డిరోడ్డు మీద విచ‌క్షణర‌ హితంగా దాడికి య‌త్నించాడుట‌. దీంతో రాణి మ‌న‌స్థాపానికి గురై శానిటైజ‌ర్ తాగింది. ఇది గ‌మ‌నించిన స్థానికులు హుటా హుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందించారు. ఈ నేప‌థ్యంలో ఈగ‌ల స‌త్యంపై రాణి కుటుంబ స‌భ్యులు కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇక ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు స్థానికంగా మంచి ప‌ట్టున్న నాయ‌కుడు. విశాఖ తూర్పులో ఓట‌మి ఎరుగ‌ని నేత‌గా గుర్తింపు ద‌క్కించుకున్నాడు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే నేత‌గా మంచి గుర్తింపు ఉంది. అలాంటి నాయ‌కుడు అనుచ‌రుడు ఇలాంటి పాడు ప‌ని చేయ‌డంతో వెల‌గ‌పూడిపైనా వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. మ‌హిళ‌ల‌పై ఇలాంటి దారుణాల‌కు ఒడిగ‌డ‌తారా? అని విశాఖ మ‌హిళా సంఘాలు భ‌గ్గుమంటున్నాయి. లైంగిక దారుణాల‌కు పాల్ప‌డే వారికి బ్ర‌తికే హ‌క్కు లేదంటూ రోడ్లెక్కి నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.