Mirai Movie: కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన మూవీ మిరాయ్. నిర్మాత విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ప్రేక్షకులు సైతం సినిమాను చూడడానికి తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. సినిమా విడుదల ఆరు రోజులు అవుతున్నా కూడా థియేటర్ల వద్ద సందడి మాత్రం తగ్గడం లేదు.
ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ ని సాధించింది. ఈ మేరకు నిర్మాతలు తాజాగా పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అలానే మూవీ సక్సెస్ ని మంగళవారం రాత్రి విజయవాడలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మిరాయ్ టీమ్ తో పాటుగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో భాగంగా నిర్మాత విశ్వప్రసాద్ సంతోషంగా మాట్లాడుతూ చేసిన వాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఈవెంట్ లో భాగంగా నిర్మాత మాట్లాడుతూ.. హీరో తేజా సజ్జా, దర్శకుడు కార్తిక్ ఘట్టమనేనికి వాళ్లకు నచ్చిన కార్లని గిఫ్ట్‌గా ఇస్తాను అంటూ అందరి ముందు స్టేజీపైనే ప్రకటించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే హీరో తేజ సజ్జా విషయానికి వస్తే.. ఇటీవల హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న తేజ ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇందులో తేజాతో పాటుగా మంచు మనోజ్ విలన్‌గా నటించారు. స్వతహాగా సినిమాటోగ్రఫర్ అయిన కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రంతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ రితికా నాయక్, ప్రత్యేక పాత్ర చేసిన శ్రియ కూడా ఈ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నారు.
Mirai Movie: మిరాయ్ మూవీ సక్సెస్.. హీరో, డైరెక్టర్ కి లగ్జరీ కార్స్.. నిర్మాత ప్రకటన!
