Minister Perni Nani : పాపం పేర్ని నాని.. ఆశలు వదిలేసుకున్నట్టేనా.?

Minister Perni Nani ..

Minister Perni Nani : పదవులు శాశ్వతం కాదు.. మంచి వ్యక్తిత్వమే శాశ్వత గౌరవాన్ని తెచ్చిపెడుతుందన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తెరిగినట్టున్నారు మంత్రి పేర్ని నాని. త్వరలో జరగనున్న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో పేర్ని నానికి ఛాన్స్ దక్కకపోవచ్చన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పేర్ని నాని, మంత్రి పదవిని నిలబెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

మంచు కుటుంబంతో సాన్నిహిత్యం, పవన్ కళ్యాణ్‌తో వైరం.. మెగాస్టార్ చిరంజీవితోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు.. ఇవేవీ పేర్ని నానికి ఉపయోగపడలేదా.? మంత్రి పదవి కొనసాగే అవకాశం లేదా.? అంటే, లేదన్న చర్చే సర్వత్రా జరుగుతోంది.

పేర్ని నాని కూడా ఈ విషయమై స్పష్టతకు వచ్చేశారు. పార్టీ కోసం పని చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది.? మంత్రిగా వున్నప్పుడు చేయాల్సిన మంచి పనులన్నీ చేశాను.. అందరి దృష్టిలోనూ మంచివాడ్నన్న పేరు తెచ్చుకున్నాను.. విపక్ష నేతలూ నాలో మంచిని గుర్తించారు.. అంటూ ఓ చానల్ చర్చా కార్యక్రమంలో పేర్ని నాని చెప్పాలనుకున్నది చెప్పేశారు.

‘ఇదేదో వీడ్కోలు సభలా వుంది..’ అంటూ సదరు చానల్ యాంకర్ సెటైర్ కూడా వేశారు. పవన్ కళ్యాణ్ మీద అంతలా విమర్శలు చేసినా వైఎస్ జగన్ కరుణించలేదా.? పవన్ మీద విమర్శలు చేసి ఏం సాధించావ్.? అని పేర్ని నానిని సొంత సామాజిక వర్గ ప్రముఖులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇదిలా వుంటే, అందరికీ షాకిచ్చేలా మంత్రి పేర్ని నానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనసాగించవచ్చన్న గుసగుసలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయ్. అదే నిజమైతే, మంత్రి పేర్ని నాని సక్సెస్ అయినట్లే. లేదంటే మాత్రం.. పేర్ని నానికి రాజకీయంగా ముందు ముందు కష్టకాలం తప్పకపోవచ్చు.