AP: పిఠాపురం ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎంతగానో కృషి చేశారు ఏకంగా తన సీటును కూడా త్యాగం చేస్తూ పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా చేశారు అయితే ఎమ్మెల్యే టికెట్ నుంచి తప్పుకుంటే తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు నాయుడు తనకు మాట ఇవ్వడంతోనే చంద్రబాబు నాయుడు మాటకు వర్మ కట్టుబడి ఉన్నారు.
ఇలా ఖాళీ అయినటువంటి ఐదు ఎమ్మెల్సీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వర్మ తనకు ఎమ్మెల్సీ ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఆయనకు మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడు మొండి చేతులు చూపించారు. ఇలా ఎమ్మెల్యే టికెట్ వదులుకున్నప్పటికీ తనకు ఎమ్మెల్సీ రాకపోవడంతో వర్మ అలాగే ఆయన అనుచరులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఇటీవల జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం ఇదే విషయం గురించి మాట్లాడారు.టీడీపీ ఇంచార్జి సీనియర్ నేత ఎస్వీఎస్ ఎన్ వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడం అన్నది పూర్తిగా టీడీపీ అంతర్గత వ్యవహారం అని తెలిపారు ఈ విషయంలో వర్మతో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. వర్మ ఎంతో సీనియర్ అనుభవం కలిగిన నాయకులు.
అలాంటి నాయకుడుకు సీటు రాకుండా పదవి దక్కకుండా చేయాల్సిన అవసరం కానీ చెక్ పెట్టాల్సిన అవసరం కానీ జనసేనకు ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇక వర్మకు మంచి పదవి వస్తే సంతోషించే మొదటి వ్యక్తులలో పవన్ కళ్యాణ్ ఉంటారని, నాదెండ్ల మనోహర్ తెలిపారు. వర్మ కూటమిలో ఒక నేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ ఎంతో కష్టపడ్డారు. అలాంటి వ్యక్తికి తామెందుకు పదవి రాకూడదని ఆశిస్తాము అంటూ ఈయన మాట్లాడారు.
పిఠాపురం జనసేన అడ్డా అని నాదెండ్ల చెప్పుకొచ్చారు. పార్టీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబుని తీసుకోవడం వెనక ఏమీ వ్యూహాలు లేవని అన్నారు. ఎన్నికల ముందే ఆయన పార్టీలో చేరాల్సి ఉందని కొన్ని కారణాల వల్లనే ఆగారని అంటూ దొరబాబుని తమ కుటుంబ సభ్యులలో ఒకరిగా భావిస్తున్నాము అంటూ నాదెండ్ల వ్యాఖ్యానించారు.
