Nara Lokesh: వెంట్రుక కూడా పీకలేరన్నందుకే 11 వచ్చాయి… జగన్ 2.O పై లోకేష్ సెటైర్స్?

Nara Lokesh: ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థలతో జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కార్యకర్తలకు పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చారు గతంలో తాను ప్రజలకు మంచి చేయాలి సేవ చేయాలి అన్న ఉద్దేశంతో కార్యకర్తలను కాస్త దూరం పెట్టాను కానీ ఈసారి అలా కాదని జగన్ కార్యకర్తల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ మాట్లాడారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను వారి బాధలను చూస్తున్నాను అయితే జగన్ 2.O అలా ఉండదని కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారు ఎక్కడున్నా వారికి శిక్ష తప్పదని తెలిపారు. ఇకపై కార్యకర్తల వెంట్రుకలను కూడా వాళ్ళు పీకలేరు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై నారా లోకేష్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాట్లాడారు. ఇలా మాట్లాడిన అందుకే ప్రజలు ఉన్న 1.0 కూడా పీకేశారు. జగన్ కి, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేమేమి చేస్తాం. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీకి రావటం ఆయన బాధ్యత. కనీసం పులివెందుల ప్రజల కోసమైనా ఆయన అసెంబ్లీకి వచ్చి పులివెందుల ప్రజల సమస్యలను మాట్లాడాలి అంటూ తెలిపారు.

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ సవాల్ కూడా విసిరారు. పులివెందుల ఎమ్మెల్యే గారికి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఏపీకి తెచ్చిన పెట్టుబడులు ఎన్ని మేము ఎనిమిది నెలలలో ఏపీకి తెచ్చిన పెట్టుబడులు ఎన్ని అనే విషయాలపై చర్చించడానికి సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. ప్రజలు జగన్ 1.0 అరాచకం నుంచే ఇంకా బయటకు రాలేదు, విధ్వంసం మర్చిపోలేదు. అలాంటిది ఈయన 2.O గురించి మాట్లాడుతూ మరోసారి కార్యకర్తల వెంట్రుకలు కూడా పీకలేరు అంటూ మాట్లాడటానికి పూర్తిస్థాయిలో విమర్శిస్తూ కామెంట్లు చేశారు.