జూమ్ మీటింగ్ లలో పాల్గొనగానే అయిపోయిందా? చంద్రబాబు ముందు జూమ్ మీటింగ్ లు ఆపి.. రాష్ట్రానికి రా. వచ్చి మాట్లాడు. నీలా కేవలం ఫోటోలకు ఫోజులిచ్చే సీఎం కాదు.. జగన్ మోహన్ రెడ్డి. ఆయన ఏదైనా నష్టం జరిగితే వెంటనే స్పందిస్తారు. మానవతా దృక్పథంతో సహాయం చేస్తారు.. అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
ఏపీలో భారీ వర్షాలు కురిసినా కూడా… వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందని… అందుకే పెద్దగా ప్రాణనష్టం జరగలేదని మంత్రి అవంతి పేర్కొన్నారు. చంద్రబాబుకు ఏం పనిలేదని.. ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా… చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని అవంతి మండిపడ్డారు.
భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని అవంతి స్పష్టం చేశారు. ఎవరి పంటకయితే నష్టం జరిగిందో.. ఆ రైతుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో లిస్ట్ చేస్తారని.. పంట నష్టపోయిన రైతులు అక్కడికెళ్లి చెక్ చేసుకోవచ్చని.. ఒకవేళ తమ పేరు లేకపోతే.. వెంటనే వివరాలు నమోదు చేయించుకోవాలని అవంతి అన్నారు.