Ambanti: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే . అంతే కాకుండా ఈయనకు తీవ్రమైన వెన్నులో నొప్పి కూడా ఉన్న నేపథ్యంలో కొద్దిరోజులు పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి జనసేన అధికారక సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇకపోతే గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారని సంగతి తెలిసిందే. అయితే ఇది తీవ్రమైతే పక్షవాతం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు స్పందించారు. ఇటీవల ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఏ జ్వరం వచ్చిందో నాకు తెలియదు అంటూ ఎద్దేవా చేశారు.
ఇలా పవన్ కళ్యాణ్ గురించి తనకు తెలియదు అంటూ మాట్లాడటమే కాకుండా కూటమి ప్రభుత్వ పాలన గురించి చంద్రబాబు నాయుడు గురించి కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు దగ్గర రెడ్ బుక్ ఉన్నంతవరకు రాష్ట్రంలో వైసీపీ నాయకులపై కేసులు పెడుతూనే ఉంటారని తెలిపారు. కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్న ఇప్పటివరకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు అంటూ విమర్శించారు.
చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం తప్పుడు హామీలన్నింటినీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన అహామీలను నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తూ ఉన్నారని అంబటి తెలిపారు. హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి 40 ఏళ్ల అనుభవం ఏమైంది అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి పక్కన పెడితే దాడులు మోసాలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు.